Dinesh Karthik Coach: బిగ్ బ్రేకింగ్.. కోచ్‌గా దినేశ్ కార్తీక్!
- కోచ్‌గా దినేశ్ కార్తీక్
- ఐపీఎల్ 2025లో కొత్త విధులు
- ఆర్‌సీబీ తరఫున ఆడిన డీకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinesh Karthik Is a Batting Coach for RCB in IPL 2025: ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మెన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అంతేకాదు ఆర్‌సీబీ మెంటార్‌గా కూడా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆర్‌సీబీ ప్రాంచైజీ తన ఎక్స్ వేదికగా తెలిపింది. ఐపీఎల్ 2025లో దినేశ్ కార్తీక్ కొత్త విధుల్లో చేరతాడని ఆర్‌సీబీ పేర్కొంది. ఐపీఎల్ 2024లో ఆర్‌సీబీ తరఫున ఆడిన డీకే.. సీజన్ అనంతరం రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఏడాదే ఐపీఎల్‌కు దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (2008, 2009, 2010) ఐపీఎల్ ప్రస్తానాన్ని ప్రారంభించిన డీకే.. 2011లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడాడు. 2012, 2013లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన కార్తీక్.. 2014లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. 2015లో ఆర్‌సీబీ.. 2016, 2017లో గుజరాత్ లయన్స్.. 2018, 2019, 2020, 2021లలో కేకేఆర్ తరఫున ఆడాడు. 2022, 2023, 2024లలో ఆర్‌సీబీకి ఆడాడు. ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో డీకే ఒకడు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మతో పాటు డీకే ఐపీఎల్‌లో 257 మ్యాచ్‌లు ఆడారు. ఇప్పటివరకు జరిగిన 17 ఎడిషన్లలో పాల్గొన్న కార్తీక్.. కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే మిస్ అయ్యాడు. డీకే తన ఐపీఎల్ కెరీర్‌లో 257 మ్యాచ్‌లు ఆడి 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కార్తీక్ 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు చేశాడు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!