RC16 : రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ టాప్ సీక్రెట్ రివీల్ చేసిన బిగ్ బాస్ సోహెల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.సుమారు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుక విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే చిత్ర యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.’గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే బుచ్చిబాబు సినిమాతో రామ్ చరణ్ బిజీ కానున్నారు. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి బిగ్ బాస్ సోహైల్ టాప్ సీక్రెట్ రివీల్ చేశాడు. ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోహెల్ ‘RC16’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..
“బుచ్చిబాబు అన్న నాకు బాగా క్లోజ్. నేను రెగ్యులర్ గా బుచ్చిబాబు అన్నతో మాట్లాడుతుంటాను. నా సమస్యలు కూడా అన్నకి చెప్పుకుంటాను. ఇండ్రస్ట్రీలో ఆయన నాకు మంచి ఫ్రెండ్. రీసెంట్ గా బుచ్చిబాబు అన్నని కలిశాను. ‘రామ్ చరణ్ గారితో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు, బిగ్ అఛీవ్మెంట్ మీకు ఇది’ అని చెప్పాను. వెంటనే బుచ్చిబాబు అన్న మాట్లాడుతూ ‘పాన్ ఇండియా కాదు… అది పాన్ వరల్డ్ మూవీ’ అని చెప్పారు” అంటూ సోహెల్ తెలిపారు.ఆయన తాజా వ్యాఖ్యలతో ‘RC16’ పై అంచనాలు తారస్థాయికి చేరాయి.రామ్ చరణ్, బుచ్చిబాబు సనా ప్రాజెక్టు వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది.మార్చి రెండో వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. కొద్ది రోజుల షూటింగ్ తర్వాత ‘RC16’ నుంచి చిన్న వీడియో గ్లింప్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై బుచ్చిబాబు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు సమాచారం.
Also Read
- RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
"PAN WORLD MOVIE" #RC16 🤞
One More Challenging Character
For our Idol @AlwaysRamCharan
@BuchiBabuSana @vriddhicinemas pic.twitter.com/3P0at4FzBi— 𝐉𝐀𝐃𝐇𝐀𝐕 𝐑𝐂 (@Jadhav_8596) February 3, 2024
తాజావార్తలు
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!