NTV Telugu Site icon

RC 16: చిట్టిబాబుకి మించి.. ‘మాస్ కా బాప్‌’ అనేలా రామ్ చరణ్‌!

Ram Charan New Look

Ram Charan New Look

ఎస్ శంకర్ సినిమా కాబట్టి లాక్ అయిపోయాడు కానీ.. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ స్పీడ్‌కి ఈపాటికే కనీసం రెండు సినిమాలైనా పూర్తి అయి ఉండేవి. ఫైనల్‌గా ‘గేమ్ ఛేంజర్’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. గతంలోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్. ఇక ప్రమోషన్స్ తప్పితే గేమ్ ఛేంజర్‌లో చరణ్ పని దాదాపుగా పూర్తైపోయినట్టే. దీంతో జెట్ స్పీడ్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెట్టేశాడు చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ 16’ షూటింగ్‌ మైసూర్‌లో మొదలు కాగా.. చరణ్‌ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.

ఉత్తరాంధ్ర విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. భారీ గడ్డంతో రగ్గడ్‌ లుక్‌లో ఊరమాస్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్‌గా చరణ్ కొత్త లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ డిజైన్ చేస్తుండగా.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చరణ్‌ లుక్ పూర్తిగా కనిపించడం లేదు. కాబట్టి ఇది ప్రీ లుక్ అనే చెప్పాలి. కానీ ఈ ప్రీ లుక్‌లో మాత్రం మాస్ కా బాప్‌ అనేలా ఉన్నాడు చరణ్. ఖచ్చితంగా రంగస్థలంలో చిట్టిబాబుకి మించిన మాసివ్ లుక్‌లో చరణ్ కనిపించబోతున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.

Also Read: Gold Price Today: ఇది కదా కావాల్సింది.. తులం బంగారంపై రూ.1310 తగ్గింది!

వీలైనంత త్వరగా ఆర్‌సీ 16 సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాబట్టి ఫస్ట్ లుక్ రివీల్‌కు పెద్దగా సమయం తీసుకునే ఛాన్స్ లేదు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

Show comments