RC 16: చిట్టిబాబుకి మించి.. ‘మాస్ కా బాప్’ అనేలా రామ్ చరణ్!
- ఆర్‌సీ 16 షూటింగ్‌లో రామ్ చరణ్
- సరికొత్తగా మేకోవర్ అవుతున్న చరణ్
- రగ్గడ్ లుక్‌లో ఊరమాస్‌గా మెగా పవర్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్ శంకర్ సినిమా కాబట్టి లాక్ అయిపోయాడు కానీ.. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ స్పీడ్‌కి ఈపాటికే కనీసం రెండు సినిమాలైనా పూర్తి అయి ఉండేవి. ఫైనల్‌గా ‘గేమ్ ఛేంజర్’ 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. గతంలోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయగా.. ప్రస్తుతం బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు శంకర్. ఇక ప్రమోషన్స్ తప్పితే గేమ్ ఛేంజర్‌లో చరణ్ పని దాదాపుగా పూర్తైపోయినట్టే. దీంతో జెట్ స్పీడ్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెట్టేశాడు చరణ్. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌సీ 16’ షూటింగ్ మైసూర్‌లో మొదలు కాగా.. చరణ్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.
ఉత్తరాంధ్ర విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. భారీ గడ్డంతో రగ్గడ్ లుక్‌లో ఊరమాస్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్‌గా చరణ్ కొత్త లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ డిజైన్ చేస్తుండగా.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో చరణ్ లుక్ పూర్తిగా కనిపించడం లేదు. కాబట్టి ఇది ప్రీ లుక్ అనే చెప్పాలి. కానీ ఈ ప్రీ లుక్‌లో మాత్రం మాస్ కా బాప్ అనేలా ఉన్నాడు చరణ్. ఖచ్చితంగా రంగస్థలంలో చిట్టిబాబుకి మించిన మాసివ్ లుక్‌లో చరణ్ కనిపించబోతున్నాడని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.
Also Read
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
Also Read: Gold Price Today: ఇది కదా కావాల్సింది.. తులం బంగారంపై రూ.1310 తగ్గింది!
వీలైనంత త్వరగా ఆర్‌సీ 16 సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాబట్టి ఫస్ట్ లుక్ రివీల్‌కు పెద్దగా సమయం తీసుకునే ఛాన్స్ లేదు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!