2026 సాధారణ సంవత్సరమే కాబట్టి ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ నెలలో కూడా బ్యాంకు సెలవులు చాలానే ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ ను రిలీజ్ చేసింది. RBI నిబంధనల ప్రకారం, ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు, అలాగే పండుగలు, ప్రత్యేక రోజుల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఫిబ్రవరిలో మహాశివరాత్రి (ఫిబ్రవరి 15) సందర్భంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. అదనంగా స్థానిక పండుగలు, ప్రత్యేక సందర్భాలలో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు కూడా మూసి ఉంటాయి. బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయని గమనించాలి.
Also Read:KCR : విచారణకు నేను రాలేను.. నోటీసులపై స్పందించిన కేసీఆర్..!
ఫిబ్రవరి 2026 లో బ్యాంకు సెలవులు
ఫిబ్రవరి 01 (ఆదివారం): వారపు సెలవు
ఫిబ్రవరి 08 (ఆదివారం): వారపు సెలవు
ఫిబ్రవరి 14 (శనివారం): రెండవ శనివారం
ఫిబ్రవరి 15 (ఆదివారం): వారపు సెలవు
ఫిబ్రవరి 18: సిక్కింలోని లోసర్ అక్కడ బ్యాంకులకు సెలవు.
ఫిబ్రవరి 19: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
ఫిబ్రవరి 20: అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం
ఫిబ్రవరి 22 (ఆదివారం): వారపు సెలవు
ఫిబ్రవరి 28 (శనివారం): నాల్గవ శనివారం
Also Read:Municipal Elections : ఎన్నికల పుణ్యమా అని మున్సిపాలిటీకి కాసుల వర్షం..!
ఈ సెలవులు దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. రాష్ట్రాలను బట్టి భిన్నంగా ఉంటాయి కాబట్టి, కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. మరికొన్ని రాష్ట్రాల్లో తెరిచి ఉంటాయి. అయితే, సెలవు దినాల్లో కూడా, బ్యాంక్ ఖాతాదారులు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, UPI, ATMల ద్వారా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు.
