RBI REPO Rate: దేశ ఆర్థిక విధానాన్ని నియంత్రించే భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య పరపతి కమిటీ (Monetary Policy Committee) తమ మూడురోజుల సమీక్ష సమావేశం అనంతరం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తాజా ప్రకటన ప్రకారం, రెపో రేటును 5.5% వద్దనే ఉంచుతూ, తటస్థ వైఖిరిని కొనసాగించనుంది. ఈ నిర్ణయం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా ఉంచుతూ RBI మరోసారి వడ్డీ రేటులపై అనిశ్చితిని నివారించింది. జూన్ నెలలో చేసిన 50 బేసిస్ పాయింట్ల కోత తర్వాత ఇదే తొలి సమీక్ష. ఈ విషయమై ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా ప్రకారం.. కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఆర్బీఐ తాజా ప్రకటనలో ద్రవ్యోల్బణం (Inflation) అంచనాలను కాస్త తగ్గించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 3.1% (గత అంచనా: 3.7%)గా పేర్కొంది. ఇందులో భాగంగా Q2: 2.1%, Q3: 3.1%, Q4: 4.4% ఉండవచ్చని ఆర్బీఐ పేర్కొంది. ఇక చివరి త్రైమాసికంలో బేస్ ఎఫెక్ట్, అభివృద్ధి చెందిన వినియోగం కారణంగా ద్రవ్యోల్బణం మరింతగా ఉండవచ్చని RBI పేర్కొంది. RBI గవర్నర్ ప్రకటన ప్రకారం, GDP వృద్ధి Q1 (2025-26): 6.5%, Q2: 6.7%, Q3: 6.6%, Q1 (2026-27): 6.6%గా ఉంటాయని అంచనా వేసింది. గ్రామీణ అభివుద్ది, ప్రభుత్వ పెట్టుబడులు, ఖరీఫ్ విత్తనాల సాగు వంటి అంశాలు డిమాండ్‌ను బలోపేతం చేస్తున్నాయని RBI చెప్పింది. మరోవైపు ఇండస్ట్రియల్ గ్రోత్ వైపు చూస్తే విద్యుత్, మైనింగ్ రంగాల బలహీనత వృద్ధికి ఆటంకంగా మారిందని కూడా తెలిపింది ఆర్బీఐ.
Betting App Case: నేడు ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ.. ఏం చెబుతాడో అని సర్వత్రా ఆసక్తి!
