Site icon NTV Telugu

Uggani Bajji Recipe: రాయలసీమ స్పెషల్.. వేడివేడి “ఉగ్గాని బజ్జీ” చేసేయండి ఇలా!

Uggani Bajji

Uggani Bajji

Uggani Bajji Recipe: రాయలసీమ వంటలు అనగానే మనకు గుర్తొచ్చే రుచికరమైన వంటల్లో ప్రముఖంగా వినిపించే ‘ఉగ్గాని & మిరపకాయ బజ్జీ’ ఒకటి. మీలో చాలామంది ఈ వంటకాన్ని తిని ఉండరు. అయినా మీ పర్వాలేదు.. ఇంట్లోనే పక్కా రాయలసీమ స్టైల్‌లో ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇలా చేసేయండి.

Toxic : టాక్సిక్ టీజర్ రిలీజ్.. థియేటర్స్ తగలబడతాయేమో

కావలసిన పదార్థాలు:
* ఉగ్గాని కోసం:
* బొరుగులు (మరమరాలు),
* ఉల్లిపాయలు,
* టమోటాలు,
* పచ్చిమిర్చి,
* పప్పుల పొడి (పుట్నాల పొడి),
* నిమ్మరసం,
* తాలింపు గింజలు,
* నూనె,
* ఉప్పు,
* పసుపు,
* కరివేపాకు.

NTPC Recruitment 2026: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో భారీగా ఉద్యోగాలు.. మంచి జీతం.. ఇలా అప్లై చేసుకోండి

బజ్జీ కోసం:
* బజ్జీ మిరపకాయలు,
* శనగపిండి,
* వాము,
* ఉప్పు,
* వంట సోడా,
* వేయించడానికి సరిపడా నూనె.

తయారీ విధానం:
ఉగ్గాని తయారీ:
బొరుగులు నానబెట్టడం: ముందుగా బొరుగులను నీళ్లలో వేసి ఒక పది నిమిషాల వరకు నాననివ్వాలి. తర్వాత వాటిని గట్టిగా పిండి మరొక గిన్నెలోకి తీసుకోవాలి.
తాలింపు: గిన్నెలోని నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
మసాలా తయారీ: ఉల్లిపాయలు వేగాక టమోటా ముక్కలు, కొంచెం పసుపు, ఉప్పు వేసి టమోటాలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
కలపడం: ఇప్పుడు నీటిలో నుండి తీసిన బొరుగులను తాలింపులో వేసి బాగా కలపాలి.
ఫినిషింగ్: చివరగా పప్పుల పొడి (పుట్నాల పొడి) చల్లి, కొంచెం నిమ్మరసం పిండుకుని బాగా కలిపి స్టవ్ ఆపేయాలి.

Varun Chakravarthy Love Story: “నువ్వు క్రికెట్ ఆడు.. నేను సంపాదిస్తాను” మిస్టరీ స్పిన్నర్ క్యూట్ లవ్ స్టోరీ!

మిరపకాయ బజ్జీ తయారీ:
పిండి కలుపుకోవడం: ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో తగినంత ఉప్పు, కొంచెం వాము, చిటికెడు వంట సోడా వేసి నీళ్లతో బజ్జీల పిండిలా (మరీ పల్చగా కాకుండా) కలుపుకోవాలి.
మిరపకాయలు సిద్ధం: బజ్జీ మిరపకాయలను మధ్యలోకి కట్ చేసి, అందులోని గింజలను తీసివేసి, అందులో వాము, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని లోపల స్టఫ్ చేయాలి.
వేయించడం: ఒక కడాయిలో నూనె వేడి చేసి, సిద్ధం చేసుకున్న మిరపకాయలను పిండిలో ముంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి.
అంతే.. వేడి వేడి ఉగ్గానిని, కరకరలాడే మిరపకాయ బజ్జీలతో కలిపి తింటే ఆ రుచే వేరు. రాయలసీమ స్పెషల్ ఈ కాంబినేషన్ ఉదయం టిఫిన్‌కైనా లేదా సాయంత్రం స్నాక్స్‌ కైనా అద్భుతంగా ఉంటుంది.

Exit mobile version