హైదరాబాద్ నగరం రాయదుర్గంలోని భూమికి ఆల్ టైమ్ రికార్డు ధర దక్కింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని టీజీఐఐసీ, జేఎల్ఎల్ ఇండియా అండ్ ఎంఎస్టీసీ భాగస్వామిగా వేలం నిర్వహించారు. రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు వేలం నిర్వహించగా.. మొత్తం రూ.1357.59 కోట్లు ప్రభుత్వంకు దక్కింది. వేలంలో పాల్గొన్న ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ అత్యధిక ధరతో 7.6 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. వేలంలో ఇది ఆల్ టైమ్ రికార్డు. ఈ ధర చూసి అందరూ షాక్ అవుతున్నారు.
Also Read: Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు మాదే.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు!
2017లో 2.84 ఎకరాల విస్తీర్ణంలో రాయదుర్గం పార్శిళ్లు ఎకరానికి రూ.42.59 కోట్లు ధర పలికింది. 2022లో హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ) నిర్వహించిన నియోపోలిస్, కోకాపేట వేలం పాటలు ఎకరానికి రూ.100.75 కోట్ల వరకు ఆర్జించాయి. 2025లో రాయదుర్గంలో ఎకరానికి రూ.177 కోట్ల ధర పలికి చరిత్ర సృష్టించింది. ఇది గత వేలం కంటే నాలుగు రెట్లు పెరుగుదల అని చెప్పాలి. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ధర చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ‘ఎకరం రూ.177 కోట్లు ఏంది సామీ’, ‘దీనమ్మ జీవితం ఎకరం అంతనా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
