NTV Telugu Site icon

Raw Onion Disadvantages: పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి హానికరం.. ఏమవుతుందో తెలుసా?

Raw Onion

Raw Onion

If You Eating Raw Onion Heavily Will Face Acidity, Constipation and Intestine Problems: భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ‘ఉల్లిపాయ’ను అందరూ ఇష్టపడుతారు. సాత్విక ఆహారాన్ని తీసుకునే కొంతమంది మాత్రమే ఉల్లిపాయలను ముట్టుకోరు. భారతీయ వంటకాల్లో ఉల్లి లేని కూర దాదాపుగా ఉండదు. నాన్ వెజ్ తినే ప్రతి ఒక్కరు నిమ్మకాయ పిండుకుని మరీ ఉల్లిని ఇష్టంగా తింటుంటారు. చాలా హోటళ్లలో సలాడ్లుగా కూడా వీటిని పెడుతారు. ఆరోగ్యానికి ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. అయితే పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల ఎంత మేలు జరుగుతుందో.. కొంత హానికరం కూడా ఉంటుందట. ముఖ్యంగా వేసవిలో పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే ఎంత హానికరమో (Disadvantages of Raw Onion) ఇప్పుడు చూద్దాం.

పేగులకు హానికరం:
వేసవిలో పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల పేగులు దెబ్బతింటాయి. పచ్చి ఉల్లిపాయ శరీరంలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా సమస్యను కలిగిస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. అందుకే పచ్చి ఉల్లిపాయలను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

Also Read: Samsung Galaxy Z Fold 5 Launch: శాంసంగ్‌ ఫ్లిప్‌, ఫోల్డబుల్‌ లాంచ్‌ డేట్‌ వచ్చేసింది.. ప్రీ బుకింగ్స్‌ మొదలు!

మలబద్ధకం సమస్య:
పచ్చి ఉల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి మరియు మలబద్ధకం సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎప్పుడూ కూడా పచ్చి ఉల్లిపాయలను పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి.

ఎసిడిటీ సమస్య:
పచ్చి ఉల్లిపాయలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎసిడిటీ సమస్యకు దారి తీస్తుంది. అందుకే పచ్చి ఉల్లిపాయను ఎక్కువగా తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి హానికరం.

Also Read: ODI World Cup 2023: ప్రపంచకప్‌ 2023కి శ్రీలంక, నెదర్లాండ్స్‌ అర్హత.. భారత్‌ లేటెస్ట్ షెడ్యూల్‌ ఇదే!