NTV Telugu Site icon

Rava Uttapam : రవ్వ ఊతప్పంను ఇలా చేస్తే.. చాలా రుచిగా ఉంటుంది..

Ravva Uthappam

Ravva Uthappam

బొంబాయి రవ్వతో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం.. అయితే ఎక్కువగా స్వీట్స్ ను చేసుకుంటాం.. దీంతో చేసే వంటలకు ఎక్కువ సమయం పట్టదు.. త్వరగా అయిపోతాయి..అలాగే తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రవ్వ ఊతప్పం కూడా ఒకటి.. ఈ ఊతప్పం కు కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కావల్సిన పదార్థాలు..

రవ్వ – ఒక కప్పు,

బంగాళాదుంప – పెద్దది ఒకటి,

చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1,

ఉప్పు – తగినంత,

చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3,

తరిగిన కొత్తిమీర – కొద్దిగా,

తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ,

క్యారెట్ తురుము – అర కప్పు,

వంటసోడా – ఒక టీ స్పూన్.

నూనె – సరిపడా

తయారీ విధానం :

ముందుగా రవ్వను ఒక గిన్నెలోకి తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి.. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.. తరువాత ఇందులోనే బంగాళాదుంప ముక్కలన, తగినన్ని నీళ్లను పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వంటసోడా తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.. ఆ తర్వాత చిటికెడు సోడాను వేసి దానిపై కొద్దిగా నీళ్లను పోయాలి. వంటసోడా పొంగిన తరువాత మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని ఉంచి నూనె వేసి వేడి చేయాలి.. తర్వాత రెండు గరిటెల పిండిని వేసి అట్టుగా వేసుకోవాలి..తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై కాల్చుకోవాలి. ఊతప్పం ఒక వైపు వేగిన తరువాత మరో వైపుకు తిప్పుకుని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.. ఇలా చెయ్యడం వల్ల చాలా రుచిగా ఉంటుంది.. దీనికి పల్లి చట్నీ, టమోటా చట్నీ తో తీసుకోవచ్చు.. లేదు అంటే అలానే తీసుకోవచ్చు.. హెల్త్ కు చాలా మంచిది.. పిల్లలు ఇష్టంగా తింటారు.. మీరు కూడా ట్రై చెయ్యండి..