Site icon NTV Telugu

Irumudi : మాస్ రాజా సరసన ప్రియా భవానీ శంకర్.. ‘ఇరుముడి’ ఫస్ట్ లుక్ చూశారా?

Erumudi Raviteja

Erumudi Raviteja

రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రవితేజ, ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ తొలిసారి జతకట్టడం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రవితేజ పక్కన ఆమె చాలా సహజంగా, చూడముచ్చటగా కనిపిస్తోంది. ప్రియా భవానీ శంకర్ కెరీర్‌లో ఇది అతిపెద్ద తెలుగు ప్రాజెక్ట్ కావడం విశేషం.

Also Read : Nagabandham : సూపర్‌స్టార్ చేతుల మీదుగా ‘నాగబంధం’ టీజర్ రిలీజ్..

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ‘బేబీ’ ఫేమ్ నకాస్త్ర ఈ సినిమాలో రవితేజ కుమార్తెగా నటిస్తుండటంతో, తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రవితేజ ఈ కథపై చాలా ఉత్సాహంగా ఉన్నానని, సరైన సమయంలో తనను వెతుక్కుంటూ వచ్చిన కథ ఇదని పేర్కొన్నారు.

Exit mobile version