NTV Telugu Site icon

Rivaba Jadeja: రివాబా జడేజా భారీ మెజార్టీతో ఘనవిజయం..

Rivaba Jadeja

Rivaba Jadeja

Rivaba Jadeja: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు విజయాన్ని సాధించింది. మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాల్లో గెలుపొంది రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో జూమ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘనవిజయం సాధించింది. ఆమె తన ప్రత్యర్థి పై 61 వేలకు పైగా భారీ మెజారిటీ సాధించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. క్షత్రియ ప్రాబల్యం ఉన్న ఈ స్థానంలో రవీంద్ర జడేజా భార్య భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్​ అభ్యర్థిగా బిపేంద్రసింగ్​ జడేజా పోటీ చేశారు. రివాబాకు సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత ఎదురైనా సరే వాటన్నింటిని ఎదుర్కొని విజయం సాధించారు.

Gujarat Election Results: గుజరాత్‌లో కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రఘుశర్మ రాజీనామా

సెప్టెంబర్ 5, 1990లో జన్మించిన రివాబా జడేజా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని ఆత్మీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. ఆమె ఏప్రిల్ 17, 2016న క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా 57 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కర్షన్‌భాయ్ కర్మూర్ 23 శాతం ఓట్లతో ఆమెకు సమీప పోటీదారుగా నిలవగా, కాంగ్రెస్‌కు చెందిన బిపేంద్రసింగ్ చతుర్‌సిన్హ్ జడేజా 15.5 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అనుభవజ్ఞుడైన హరి సింగ్ సోలంకి బంధువు, రివాబా జడేజా 2019 లో బీజేపీలో చేరారు.