Ravindra Jadeja: నేడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత జట్టు సహచరులు రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ మధ్య జరిగిన చిన్నపాటి మైదాన పోరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని జడేజా సరిగా టైమ్ చేయలేక క్యాచ్ ఇచ్చాడు. దీంతో వికెట్ దక్కిందని భావించిన శార్దూల్ ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తూ, జడేజాకు సరదాగా సెండ్‌ఆఫ్ ఇచ్చాడు. జడేజా కూడా పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది.
అయితే వెంటనే రీప్లే పరిశీలించిన అంపైర్లు శార్దూల్ నో బాల్ వేసినట్లు గుర్తించారు. బౌలింగ్ సమయంలో అతడు క్రీజ్ దాటడంతో అవుట్ కాస్త రద్దు అయింది. దీంతో జడేజాకు మరో అవకాశం లభించగా.. ముంబై ఇండియన్స్ శిబిరంలో నిరాశ కనిపించింది. ఇక అక్కడి నుంచి మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. లైఫ్ దక్కించుకున్న జడేజా, తర్వాతి బంతులకే వరుసగా రెండు బౌండరీలు బాదాడు. అనంతరం శార్దూల్ వైపు తిరిగి అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేస్తూ.. ముందుగా ఇచ్చిన సెండ్ ఆఫ్‌కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ సరదా పోటీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
The kind of banters we love to see 😂💙🩷#TATAIPL | #KhelBindaas | #MIvRR | @mipaltan | @rajasthanroyals pic.twitter.com/j9A7YIphGr
— IndianPremierLeague (@IPL) May 24, 2026
