Sahadev : ఆ భాషలో ‘సహదేవ్’ గా రానున్న రవితేజ ‘ఈగల్’ మూవీ..

Whatsapp Image 2023 12 15 At 10.18.06 Pm

Whatsapp Image 2023 12 15 At 10.18.06 Pm

మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.రవితేజ టైగర్ నాగేశ్వరరావు వంటి పాన్ ఇండియా సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.అక్టోబర్‌ 19 న దసరా కానుక గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌ గా మిగిలింది. ఎక్కువ నిడివి తో మొదట్లో డివైడ్‌ టాక్‌ రావడంతో 20 నిమిషాల  లెంగ్త్‌ ను మేకర్స్ తగ్గించారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం మారినప్పటికీ ఓ మోస్తారు కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి అయితే వచ్చింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైనప్పటికీ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా అంతగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ఈగల్‌.టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్‌ కమ్‌ డైరెక్టర్‌ అయిన కార్తీక్‌ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. ఇక ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే కావ్య థాపర్ మరో కీలక పాత్ర లో నటిస్తోంది.

సంక్రాతి కానుక గా ఈ సినిమాను జనవరి 13 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌ గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఒక అప్‌డేట్ ను ఇచ్చారు. ఈ మూవీని హిందీలో ‘సహదేవ్’ అనే పేరుతో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. హిందీ వెర్షన్‌ కు సంబంధించిన టీజర్‌ ను ఈ రోజు రాత్రి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.ఇక ఈగల్‌ మూవీ లో నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల మరియు మధుబాల వంటి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. డవ్‌జాండ్ సంగీతం అందిస్తున్నారు.