NTV Telugu Site icon

Harish Shankar : తీవ్ర మెడ నొప్పితో రవితేజ షూటింగ్.. హరీష్ శంకర్ పోస్ట్ వైరల్..

Raviteja

Raviteja

Harish Shankar : మాస్ మహారాజ రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీనితో రవితేజ తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్”..స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ధమాకా, ఈగల్ సినిమాల తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో  రవితేజ మరో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read Also :Kannappa : ప్రభాస్ కోసం రాసుకున్న కథను.. మేము తీసుకున్నాం : మోహన్ బాబు

ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్ లో రవితేజ పాల్గొంటున్నారు. అయితే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారిందిహరీష్ శంకర్.. తాజాగా రవితేజ ఫోటోను షేర్ చేశారు. అందులో రవితేజ మెడకు బ్యాండ్ తగిలించుకుని కనిపించారు.. “మాస్ మహారాజా రవితేజ డెడికేషన్ కు హ్యాట్సాఫ్. తీవ్రమైన మెడ నొప్పి ఉన్నాకూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. థ్యాంక్యూ అన్నయ్య.. రోజూ మాకు స్ఫూర్తిని ఇస్తున్నారు” అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేసారు.అయితే ఈ పోస్ట్ చూసిన రవితేజ ఫ్యాన్స్ టేక్ కేర్ అన్న అని పోస్ట్లుపెడుతున్నారు.