రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఒకప్పుడు వీరిద్దరూ కలిసి అందించిన ‘కిక్’ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో మనందరికీ తెలుసు. అయితే, ‘కిక్ 2’ మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజ్‌ను ‘కిక్ 3’ రూపంలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ జోడీ సిద్ధమవుతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ‘ఏజెంట్’ సినిమా ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి, తాజాగా రవితేజకు ఒక పవర్ఫుల్ కథ వినిపించారని, ఆ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో రవితేజ వెంటనే ఓకే చెప్పేశారని సమాచారం.
Also Read : Krithi Shetty: కృతి శెట్టి కెరీర్‌కు.. దెబ్బ మీద దెబ్బ
అయితే, ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాత మారడం, అలాగే సురేందర్ రెడ్డి మరియు రవితేజ ఇద్దరి మార్కెట్ ప్రస్తుతం కొద్దిగా తగ్గిన నేపథ్యంలో, ‘కిక్’ ఫ్రాంచైజ్ క్రేజ్ ఈ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ‘కిక్ 3’ సెట్స్‌పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా గట్టి కం బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో సురేందర్ రెడ్డి ఒక బలమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఫ్యాన్స్ మాత్రం ఈ మాస్ కాంబో గురించి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
