NTV Telugu Site icon

Raviteja : రవితేజ రెమ్యునరేషన్ విషయంలో తర్జనభర్జన పడుతున్న నిర్మాతలు

Raviteja

Raviteja

Raviteja : హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు తీసే హీరో రవితేజ. కెరియర్‎లో ఒక హిట్ పడితే రెండు ఫ్లాప్‎లు బ్యాక్ టూ బ్యాక్ పడతాయి. మరల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బౌన్స్ అయ్యాడు అనుకునే లోపే మరో డిజాస్టర్‎ని ఖాతాలో వేసుకుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు తక్కువ కాకుండా ప్రేక్షకుల ముందుకి వస్తోన్న ఏకైక హీరో రవితేజ. ఇటీవల ధమాకా, వాల్తేరు వీరయ్యతో వరుసగా రెండు హిట్స్ కొట్టిన రవితేజ .. రావణాసురతో బిగ్గెస్ట్ డిజాస్టర్‎ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఫలితం కారణంగా నిర్మాతలు రవితేజ అడిగిన చేసిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలని డిసైడ్ అయ్యారంట.

Read Also:Vijay : కెరీర్లో భారీ రిస్క్ తీసుకుంటున్న విజయ్

కానీ రవితేజ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా హిట్ పడితే పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ పెంచుకోవచ్చు.. కాబట్టి రెమ్యునరేషన్ పెంచాలనే యోచనలో రవితేజా ఉన్నారట. దీంతో తన ఫోకస్ అంతా టైగర్ నాగేశ్వరరావు పైనే పెట్టారట. ఇక ఈ మూవీకి కూడా అన్ని భాషలలో స్టార్ నటులతో వాయిస్ ఓవర్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ లైఫ్ రాబిన్ హుడ్‎గా పేరు పొందిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‎గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‎లో రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్‎తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీతో రేణు దేశాయ్ నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. మూవీలో కృతిసనన్ చెల్లెలు నుపూర్ సనన్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెడుతోంది. హిందీలో గాయనిగా నటిగా ఇప్పటికే ఆమె కెరియర్ స్టార్ట్ చేసింది.

Read Also:Ajith : అజిత్ కొత్త వ్యాపారం.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఫ్యాన్స్

Show comments