Vijay : కెరీర్లో భారీ రిస్క్ తీసుకుంటున్న విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay : దళపతి విజయ్ ఇటీవల వారసుడు సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించారు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీనిని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ని విస్తరించాలని అనుకుంటున్నారట. ఈ మూవీ ఓపెనింగ్ కలెక్షన్లు రికార్డుల వర్షం కురిపిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. లియో తర్వాత ఆయన ఓ తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అందరినీ షాకింగ్ గురిచేసే నిర్ణయాన్ని విజయ్ తీసుకున్నారట. వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోలు తమ తదుపరి సినిమా భారీ హిట్ ఇచ్చే డైరెక్టర్ తో చేయాలని భావిస్తారు. కానీ విజయ్ ప్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి ఒకే చేశాడు. నిజానికి విజయ్‌తో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ఉత్సాహం చూపిస్తున్నా ఆయన వెంకట్ ప్రభుతో సినిమా చేయడానికి అంగీకరించడం విశేషం.
Read Also:Zomato: జొమాటో సీఓడీ ఆర్డర్లలో 70 శాతం రూ. 2000 నోట్లే.. విత్ డ్రా ఎఫెక్ట్..
Also Read
- ICC Schedules: 2035 వరకు ఐసీసీ క్రికెట్ టోర్నీల షెడ్యూల్ విడుదల.. ఇండియాలో ఆ వరల్డ్ కప్..
- Akhilesh Ayodhya Visit: ‘‘నమాజ్ చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు’’.. అఖిలేష్ ‘‘రామమందిర’’ సందర్శనపై ఓవైసీ వ్యాఖ్యలు..
- BJP: ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. రాహుల్ గాంధీ నవ్వులపై బీజేపీ మండిపాటు!
- Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
వెంకట్ ప్రభు కెరీర్లో పెద్దగా ఆకట్టుకున్న సినిమాలు ఏమీ లేవనే చెప్పాలి. తాజాగా కస్టడీ సినిమాలను తెరకెక్కించాడు. వీటిలో మానాడు మ్యాన్ కథ తప్ప పెద్దగా ఆకట్టుకున్న సినిమాలు ఏవీ లేవు. తాజాగా విడుదలైన కస్టడీ సైతం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద తీవ్ర నిరాశకు గురిచేసింది. అలాంటి డైరెక్టర్‌తో విజయ్ సినిమా ఒకే చేశాడు అనగానే ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కేవలం విజయ్ స్టామినా మీదే సినిమా హిట్ ప్లాప్ మీద ఆధారపడి ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నిజానికి వెంకట్ ప్రభు ప్రాజెక్టులో యూనివర్సల్ అప్పీల్ లేకపోవడమే అతి పెద్ద లోపం. ఆయన కథలు బాగోవు అని చెప్పలేం. కానీ అందరికీ నచ్చవు. చాలా కొద్ది మందికి మాత్రమే నచ్చుతుంటాయి. అందుకే వెంకట్ ప్రభుతో సినిమా అనగానే ఫ్యాన్స్ భయపడుతున్నారు. విజయ్‌కి స్క్రిప్ట్ నచ్చే విధంగా చెప్పిన వెంకట్ ప్రభు సినిమా కూడా అలా అందరికీ నచ్చేలా తీస్తే బాగుండని కోరుకుంటున్నారు. మరి కొందరేమో విజయ్ తన కెరీర్లో అతిపెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also:Ajith : అజిత్ కొత్త వ్యాపారం.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఫ్యాన్స్
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
ICC Schedules: 2035 వరకు ఐసీసీ క్రికెట్ టోర్నీల షెడ్యూల్ విడుదల.. ఇండియాలో ఆ వరల్డ్ కప్..
-
Akhilesh Ayodhya Visit: ‘‘నమాజ్ చేసిన ప్రాంతానికి వెళ్తున్నారు’’.. అఖిలేష్ ‘‘రామమందిర’’ సందర్శనపై ఓవైసీ వ్యాఖ్యలు..
-
Satvika Veeravalli: రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు, అమెరికా జాబ్ వదిలేసి హీరోయిన్గా వచ్చా: సాత్విక వీరవల్లి
-
Aakasamlo Oka Tara: ‘రేసుగుర్రం’ షూటింగ్ టైంలో బన్నీ అన్న చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను: పవన్ సాధినేని
-
Aakasamlo Oka Tara: నాని తర్వాత ఆ పాత్రకు దుల్కరే కరెక్ట్: అల్లు అరవింద్
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!