Site icon NTV Telugu

Raviteja: ఏం జరిగినా మాస్ మహారాజ్ మారడు.. ఇదిగో ప్రూఫ్..

Ravitej

Ravitej

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు ప్లాపులు పలకరిస్తున్నా తగ్గేదేలే అంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెడుతున్నాడు.. ఇటీవల ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. గతంలో వచ్చిన సినిమాలన్ని యాక్షన్ సినిమాలే.. ఆ సినిమాలు సరైన హిట్ ను ఇవ్వలేదు.. దాంతో ఇప్పుడు రూటు మార్చినట్లు తెలుస్తుంది..

గతంలో క్రాక్ తర్వాత ఇప్పటివరకు రవితేజ ఆరు సినిమాలలో నటించాడు.. అందులో ధమాకా ఫుల్ లెంగ్త్ యాక్షన్ కాదు, కామెడీ, శ్రీలీల డ్యాన్సులు బాగా వర్కౌట్ అయి హిట్ అయిందని చెప్పొచ్చు.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు మొత్తం అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి.. ఆ దెబ్బతో ఇప్పుడు మళ్లీ కామెడీ సినిమాల కథలను వింటున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. వరుస యాక్షన్ సినిమాలు రవితేజకి కలిసి రావట్లేదని మళ్ళీ తన ఫేవరేట్ జోనర్, తనకి బాగా కలిసొచ్చిన జానర్ కామెడీకి షిఫ్ట్ అవుతున్నాడట..

రవితేజకు యాక్షన్ సినిమాల కన్నా, కామెడీ సినిమాలే మంచి హిట్ ను అందుకున్నాయి.. అందులో ఇప్పుడు కొత్త దర్శకులతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే ఎంతో మంది కొత్త కొత్తవాళ్ళతో సినిమాలు చేశాడు.. ఆ సినిమాల రిజల్ట్ తేడాగా పడిన మాస్ హీరో తగ్గట్లేదు.. జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో ఓ సినిమా చేస్తున్నాడు..ఇప్పుడు సామజవరగమన రచయిత భాను బోగవరపు రవితేజకి ఓ కామెడీ కథ చెప్పిట్లు సమాచారం.. మరి ఇదన్న రవన్నకు వర్కౌట్ అవ్వాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు..

Exit mobile version