Bharta Mahashayulaku Vignapthi: మాస్ మహారాజా రవితేజ తన కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్‌తో అదరగొట్టాడు. తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం భర్తల జీవితంలోని సమస్యలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు, వంటి అంశాలను హాస్యంతో మేళవించి, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది.
READ ALSO: Akhanda 2 : ‘అఖండ 2’ తెలుగు సినిమా కాదు.. భారతీయులందరి చిత్రం: బాలయ్య
ఈ చిత్రంతో మాస్ మహారాజా రవితేజ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ టీజర్‌లో తన స్టైల్‌లో రవితేజ పలికిన పలు డైలాగ్స్ అదరగొట్టాయి. ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుభలేఖ సుధాకర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వరుస ఫ్లాప్‌లతో సతమతవుతున్న మాస్ మహారాజకు ఈ సినిమా బలమైన కమ్‌బ్యాక్ ఇస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.
READ ALSO: Modi Magic on X: ఎక్స్‌లో మోడీ మ్యాజిక్… టాప్ 10లో 8 ప్రధానివే!
