NTV Telugu Site icon

Ravi Shastri: కాలంతో పాటు మారాలి.. ఆ నిబంధన మంచిదే!

Ravi Shastri React on Impact Player Rule: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధనపై ఆటగాళ్లు, నిపుణులు తమతమ అభిప్రాయాలను తెలిపారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. టీమిండియా ఆటగాళ్లు అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌లు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను విమర్శిస్తుంటే.. టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి మాత్రం ఆ నిబంధన మంచిదే అని అంటున్నాడు. ఇంపాక్ట్‌ రూల్ వల్ల మ్యాచ్‌లు మరింత హోరాహోరీగా సాగుతాయని అభిప్రాయపడ్డాడు.

రవిచంద్రన్ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘ఆటలో కొత్త నిబంధన వచ్చినప్పుడు అది ఎందుకు సరైంది? కాదో? చెప్పే వాళ్లుంటారు. కానీ 190, 200 స్కోర్లు నమోదవుతున్నప్పుడు.. ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నప్పుడు జనం పునరాలోచిస్తారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన మంచిదే. కాలంతో పాటు మనం మారాలి. ఇతర క్రీడల్లో కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధన వల్ల మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయి’ అని అన్నాడు.

Also Read: Team India Coach: కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ వేట.. రేసులో ఇద్దరు టీమిండియా మాజీ ప్లేయర్స్!

గత ఐపీఎల్‌ సీజన్‌లో ఎన్నో మ్యాచ్‌లు రసవత్తరంగా ముగియడం మనం చూశామని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన ఎంతో ప్రభావం చూపించిందన్నాడు. అయితే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన శాశ్వతం కాదని, అందరినీ సంప్రదించి టీ20ప్రపంచకప్‌ 2024 తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ కార్యదర్శి జై షా ఇటీవల అన్నాడు.

Show comments