Ravi Basrur: ఆ రూ.35 వేలే నా జీవితాన్ని మార్చాయి.. స్టేజ్ పైనే ఏడ్చేసిన రవి బస్రూర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Basrur: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మెగాఫోన్ పట్టుకొని, హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్ట్”. తాజాగా ఈ రోజు ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్, రవి బస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రిలీజ్ అయిన ఈ టీజర్ ఊచకోత సృష్టిస్తుంది. నిజానికి ఈ రోజు నిర్వహించిన చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్.
READ ALSO: Harmful Beauty Products: నిపుణుల హెచ్చరిక.. ఈ ప్రొడక్ట్స్‌తో మీ చర్మం, జుట్టు నాశనం..!
Also Read
- Ashwin: "సచిన్‌తో పోలికలా? అప్పటి రోజులు వేరు".. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ 'పెసరపప్పు పాయసం' చేసేయండి ఇలా.!
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- France: మ్యూజిక్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటనలు.. సిరంజిలు గుచ్చి యువతులపై అత్యాచారాలు..
ఆయన స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ.. “18 ఏళ్ల వయసులో నేను రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. ఏ ఆశా లేదు, ఏ ఆశయం లేదు” అని ఆయన చెప్పగానే హాల్‌లో నిశ్శబ్దం అయిపోయింది. ఆ క్షణంలో ఆయన జీవితంలో వచ్చిన ఒక మార్పు… ఆ మార్పే ఈ రోజు రవి బస్రూర్‌ని రవి బస్రూర్‌గా మార్చిందన్నారు. ‘తన అసలు పేరు కిరణ్ అని, రెండో సారి చనిపోడానికి ప్రయత్నించిన సందర్భంలో నన్ను కాపాడి, నాకు అవసరమైన కీ బోర్డు కొనుక్కోవడానికి రూ.35 వేల ఇచ్చిన వ్యక్తి పేరు ‘ రవి ‘, అప్పటి నుంచి నాకు పునర్జన్మ ఇచ్చిన ఆయన పేరే నా పేరుగా పెట్టుకున్నాను’ అని అన్నారు. కర్ణాటకలోని బస్రూర్ గ్రామంలో పుట్టిన ఆయన… బ్లాక్‌స్మిత్ (కమ్మరి), స్కల్ప్టర్, కాన్‌స్ట్రక్షన్ వర్కర్, గోల్డ్‌స్మిత్, టైలర్, హౌస్ పెయింటర్… ఇలా ఎన్నో జాబ్స్ చేశాడు. డబ్బు లేక పబ్లిక్ టాయిలెట్‌లో నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. కిడ్నీ అమ్మేయాలని కూడా ఆలోచించిన స్థాయికి వచ్చాడు. ఆ డార్క్ ఛాప్టర్‌లో… ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు రవి. ఆయన కిరణ్‌కి రూ.35 వేలు పెట్టి కీబోర్డ్ కొనిచ్చాడు. “నీలో మ్యూజిక్ ఉంది… దాన్ని వదులొద్దు” అని చెప్పాడు. ఆ రోజు నుంచి కిరణ్ మారిపోయాడు. తనని కాపాడిన ఆ వ్యక్తి పేరునే తన మొదటి పేరుగా పెట్టుకున్నాడు. అలాగే తన ఊరి పేరును కూడా జత చేసి… రవి బస్రూర్ అయ్యాడు. అది జస్ట్ ఒక పేరు మార్పు మాత్రమే కాదు… ఒక జీవిత గమనాన్ని మార్చిన మార్పు. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్ ఛాఫర్ట్ 1 & 2, సలార్, మార్కో లాంటి బ్లాక్‌బస్టర్‌లకు రవిబస్రూర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు అదిరిపోయేలా ఇచ్చి, ఆయా సినిమాల సక్సెస్‌లో కీరోల్ ప్లే చేశాడు.
ఇప్పుడు ఆయన విశ్వక్‌సేన్ హీరోగా, నటిస్తూ దర్శకత్వం వహించిన కల్ట్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఈ రోజు నిర్వహించిన ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మరొక హైలెట్ సంఘటన కూడా జరిగింది. అదే విశ్వక్ – రవిబస్రూర్‌కు రోలెక్స్ వ్యాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం. ఆ వ్యాచ్‌ను తీసుకునే సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ రవిబస్రూర్ చాలా ఎమోషనల్ అయ్యారు. చిత్ర టైలర్ విషయానికి వస్తే.. ఊతకోత సృష్టిస్తుంది. ఈ టైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచిందని విశ్వక్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
READ ALSO: Akarshitha: ‘ఆకర్షిత’తో రాబోతున్న త్రిగుణ్.. గ్రాండ్‌గా మొదలైన కొత్త సినిమా!
తాజావార్తలు
-
ASUS ROG Laptops: ASUS నుంచి కొత్త AI ల్యాప్టాప్స్.. క్రియేటర్లు, గేమర్ల కోసం ప్రీమియం ROG లైనప్ విడుదల
-
Eetha Teaser : శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. ‘ఈట’ టీజర్.. నెక్ట్స్ లెవల్
-
Ashwin: “సచిన్‌తో పోలికలా? అప్పటి రోజులు వేరు”.. వైభవ్ సూర్యవంశీ వివాదంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Realme P4x 4G: 8000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 50MP కెమెరాతో.. రియల్మీ P4x 4G విడుదల
ట్రెండింగ్
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్‌లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్‌తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!