NTV Telugu Site icon

Madhya Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం..

Rats

Rats

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం చేసే వీడియో ఒకటి బయటపడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఓ వార్డులో ఎలుకలు తిరుగుతున్నట్లు కనపడే వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఘటనతో వైద్య సదుపాయంలో సమర్థవంతమైన పెస్ట్ కంట్రోల్‌ను ఆదేశించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను.. మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ మంగళవారం తన X హ్యాండిల్‌లో షేర్ చేసింది. గ్వాలియర్‌లోని కమల రాజా ఆసుపత్రిలో “రోగుల కంటే ఎలుకలు ఎక్కువ” అని పేర్కొంటూ, రాష్ట్రంలోని ఆరోగ్య సౌకర్యాల పరిస్థితిపై ప్రభుత్వాన్ని విమర్శించింది.

Read Also: Viral Video : నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాలపై నాగు పాము..!

మరోవైపు.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆస్పత్రిలో ఎలుకలు తిరుగుతున్న వీడియోను షేర్ చేశారు. ఇది కమల రాజా హాస్పిటల్‌లోని వార్డు అని, గ్వాలియర్‌లోని ప్రభుత్వ గజ్ర రాజా మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలోని మహిళ, పిల్లల వైద్య సదుపాయం అని పేర్కొన్నారు. కాగా.. మెడికల్ కాలేజీ డీన్ ఆర్కేఎస్ ధాకడ్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వీడియో తన దృష్టికి వచ్చిందని, ఎలుకల సమస్య నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించినట్లు తెలిపారు. చీడపీడల నివారణ వార్డుల్లోనే జరుగుతుందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలని ఆసుపత్రి అధికారులను కోరినట్లు తెలిపారు.