Site icon NTV Telugu

Ration Dealers: సమ్మె కొనసాగింపుపై వెనక్కి తగ్గిన రేషన్‌ డీలర్లు.. రేపటి నుంచి రేషన్ షాపులు ఓపెన్

Ration

Ration

Ration Dealers: సమ్మె కొనసాగింపుపై రేషన్‌ డీలర్లు వెనక్కి తగ్గారు. దీంతో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్‌ షాపులు తెరుచుకోనున్నాయి. ఇంతకు ముందు రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. కనీస గౌరవ వేతనంతో పాటు తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘాల ఐక్యవేదిక సమ్మె బాట పట్టింది.

Read Also: R Krishnayya: బీసీల్లోని 6 కులాలకే రూ. లక్ష ఇస్తోంది: ఆర్ కృష్ణయ్య

డీలర్లు చనిపోతే వారి కుటుంబంలోని వ్యక్తికే సదరు రేషన్ షాప్ ని కేటాయించాలని డీలర్లు డిమాండ్ చేశారు. అలాగే పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, కనీస గౌరవ వేతనంగా 30 వేలు, ఆరోగ్య కార్డుల పంపిణీతో పాటు శాశ్వత ప్రాతిపదికన రేషన్ డీలర్ షిప్ ను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో రేషన్ డీలర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చర్చలు జరిపారు.

Read Also: Health: అశ్వగంధం మానవునికి అన్ని లాభాలు చేస్తుందా.. చివరకు దానికి కూడానా..!

అంతకుముందు.. రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. డీలర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడంతోనే వారు సమ్మె చేసే దుస్థితి నెలకొందన్నారు. కేంద్రం ఉచితంగా బియ్యం పంపినా పేదలకు పంపిణీ చేయడం లేదన్నారు. డీలర్లకు కేంద్రం సకాలంలో కమీషన్ చెల్లిస్తున్నా దానిని రాష్ట్ర ప్రభుత్వ సొంతానికి వాడుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు.

Exit mobile version