NTV Telugu Site icon

Ratha Saptami 2024: తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

Ratha Saptami

Ratha Saptami

Ratha Saptami 2024: తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ప్రస్తుతం సూర్యప్రభ వాహనంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగుతున్నారు మలయప్పస్వామి.. మొత్తం 7 వాహనాలపై భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు..

Read Also: Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్‌ పదవిపై జై షా కీలక ప్రకటన!

ఇక, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. ఈరోజు, రేపు తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది టీటీడీ.. ఇక, ఈ రోజు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు టీటీడీ అధికారులు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి వెలపల క్యూ లైనులో వేచిఉన్నారు భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా.. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 45,825 మంది భక్తులు.. 21,380 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లుగా పేర్కొంది టీటీడీ.

Show comments