NTV Telugu Site icon

Ratan Tata: రతన్‌ టాటా మృతి.. ప్రముఖుల నివాళులు

Ratan Tata

Ratan Tata

Ratan Tata: దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన రతన్ టాటా.. బీపీ అకస్మాత్తుగా పడిపోవడంతో సోమవారం నుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు రతన్ టాటా. ఈ సందర్బంగా దేశ, విదేశ ప్రముఖులు నివాళులు అర్పించారు.

Ratan Tata Death: 140కోట్ల మంది హృదయాలకు దగ్గరైన రతన్ టాటా.. ఆయన జీవన ప్రస్తానమిదే

ఈ సందర్బంగా రతన్‌ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. భారత్ దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయింది.. రతన్‌ టాటా సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ తెలిపారు. అలాగే రతన్‌ టాటా మృతి పట్ల ప్రధాని మోడీ కూడా సంతాపం తెలిపారు. దూరదృష్టి గల వ్యాపారవేత్త రతన్‌ టాటా, సమాజ హితం కోసం రతన్‌ టాటా పనిచేశారని ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదిక తెలిపారు. రతన్‌ టాటా మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. మెరుగైన సమాజం కోసం రతన్‌ టాటా కృషి చేశారని.. పారిశ్రామిక రంగం, దాతృత్వంలో భావితరాలకు రతన్‌ టాటా ఆదర్శం అని చంద్రబాబు తెలిపారు. ఇక ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజ‌మైన ఐకాన్ ర‌త‌న్ టాటా అని., దేశ నిర్మాణానికి ర‌త‌న్ టాటా స‌హ‌కారం అందించడంతో పాటు, దేశానికి ర‌త‌న్ టాటా సేవ‌లు స్పూర్తిదాయకమని తెలిపారు.

Kaleshwaram Project : రబీ ఆయకట్టును కాపాడేందుకు కాళేశ్వరం పనులను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్న సర్కార్‌

Show comments