Ratan Tata: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా: కేసీఆర్
- రతన్ టాటా మృతిపట్ల కేసీఆర్ సంతాపం
- ప్రతి ఒక్కరికీ టాటా ఆదర్శం
- అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతిపట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని పేర్కొన్నారు. సమాజ హితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని అన్నారు. రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తుకోసం జీవితకాలం తపించిన రతన్ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
‘ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా. సమాజ హితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శం. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకోవాలనే సామాజిక ఆర్థిక తాత్వికతను సొంతం చేసుకున్న అరుదైన పారిశ్రామిక వేత్త టాటా. సమాజ సంక్షేమం కోసం, రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తు కోసం జీవితకాలం తపించిన ఆయన ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా నిలవాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Also Read
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
- 64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఒక కార్యక్రమానికి హాజరై.. నూతన తెలంగాణ రాష్ట్రం అనతికాలంలో సాధిస్తున్న అభివృద్ధిని అభినందించడం, సాంకేతిక పారిశ్రామిక రంగాల్లో నాటి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన దార్శనిక కార్యాచరణ పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేయడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ స్మరించుకున్నారు. మానవతావాది టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ సీఎం ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!