దేశ వ్యాప్తంగా ఎటు చూసినా వర్షాలే.. బంగాళాఖాతం లో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మనుషులు జంతువులు వర్షాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కానీ ఓ ఎలుక మాత్రం వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఎంచక్కా స్నానం చేసేసింది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. మాములుగా డ్రైనేజీల్లో కూడా ఎలుకలు సంచరిస్తుంటాయి. అటువంటిది ఎలుక స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఓ ఎలుక జోరుగా కురుస్తున్న వర్షంలో చక్కగా షవర్ బాత్ చేస్తోంది. ఒక్కో వాన చినుకులు పడుతుంటే చక్కగా ఎంజాయ్ చేస్తు స్నానం చేస్తోంది.
తలమీద ముందున్న రెండు కాళ్లను చేతుల్లాగా తిప్పుతు వానచినుకులు టపటపా తలమీద పడుతుంటే వాటితో తల తడుపుకుంటున్నట్లుగా స్నానం చేస్తోంది. ఎలుక వాన నీటిలో స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోను చూసిన వారంతా కూడా ఎలుక ఇలా చేస్తుందా అంటూ ఆశ్చర్య పోతున్నారు.. అమ్మ సబ్బు ఉంటే బాగుండు.. మళ్లీ వర్షాలు ఎప్పుడొస్తాయో అంటూ రకరకాల మీమ్స్ తో కామెంట్స్ చేస్తున్నారు..
వైరల్ అవుతున్న ఆ వీడియోలో వర్షం పడుతున్న సమయంలో మనుషులు ఎలా ఎంజాయ్ చేస్తారో.. అచ్చం ఆ ఎలుక కూడా అలాగే తలపై పడుతున్న వాన చినుకులతో తల నిమురుకుంటు స్నానం చేసింది. స్నానం చేసింది. వర్షం నీటిని మొఖంపై పోసుకుని మొహం కూడా కడుక్కున్న తీరు చూస్తే నవ్వొస్తుంది.. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియా లో షేర్ చేయటంతో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వార్నీ ఇది ఎలుకా? మరీ ఇంత శుభ్రత పాటిస్తోందే..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.. ఎంత ముద్దుగా స్నానం చేసిందో మీరు కూడా ఒక లుక్ వేసుకోండి..
A very clean ratpic.twitter.com/FvwoSUoJG4
— Figen (@TheFigen_) July 5, 2023