NTV Telugu Site icon

Rassie Vander Dussen: కళ్లు మూసి తెరిచేలోగా క్యాచ్.. ఈ వరల్డ్ కప్లో బెస్ట్ ఇదేనేమో..!

Rassie Van Der Dussen

Rassie Van Der Dussen

తొలిసారి ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే ఆశలు నిరాశలయ్యేటట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో కొన్ని మ్యా్చ్ ల్లో భారీ స్కోరు చేసిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ లో పేలవ ప్రదర్శన కనబరిచింది. దీంతో సౌతాఫ్రికా కేవలం 212 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. సౌతాఫ్రికా టాప్ ఆర్డర్లు ఈ మ్యాచ్ లో విఫలం కాగా.. మిడిలార్డర్ క్లాసెన్, మిల్లర్ మంచి ఇన్నింగ్స్ ఆడటంతో ఈ పరుగులు వచ్చాయి. అయితే ఆస్ట్రేలియా జట్టు ఈ పరుగులు చేయకుండ ఉండటానికి.. జట్టుకు మంచి బౌలింగ్, ఫీల్డింగ్ అవసరం. అలాంటి క్రమంలో సౌతాఫ్రికా జట్టులో ఫీల్డింగ్ లో కొంత వైఫల్యం ఏర్పడినప్పటికీ.. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ మాత్రం ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టి కళ్లు బైర్లు కమ్మేలా చేశాడు.

Pakistan: పాకిస్తాన్ కార్ మార్కెట్ ఢమాల్.. దాయాదితో పోలిస్తే భారత్‌లో 100 రెట్లు ఎక్కువ అమ్మకాలు..

ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ క్యాచ్ ను వాన్ డెర్ డస్సెన్ అద్భుతంగా పట్టాడు. కగిసో రబాడ బౌలింగ్ లో కవర్ డ్రైవ్‌ను కొట్టాడు.. కానీ అక్కడ ఉన్న వాన్ డెర్ డస్సెన్ అతని కుడివైపు గాలిలో లాంగ్ డైవ్ చేసి ఓ అద్భుతమైన క్యాచ్‌ పట్టుకున్నాడు. దీంతో ఫలితంగా మార్ష్ తన ఖాతా కూడా తెరవకుండా పెవిలియన్ బాట పట్టాడు.

Tammineni Sitaram: కులగణన కోసం శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం..

మరోవైపు ఈ మ్యాచ్ లో ఏ జట్టైతే గెలిస్తే.. ఆ జట్టు ఫైనల్ లో ఇండియాతో తలపడనుంది. ఈనెల 19న (ఆదివారం) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చూడాలి మరీ రెండో సెమీ ఫైనల్ లో ఏ జట్టు గెలుస్తుందో…………

Show comments