Site icon NTV Telugu

Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్

Rashmika

Rashmika

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక  ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక  ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. కాగా నేడు (ఏప్రిల్ 5) తన 30వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ రణబాలి’ టీమ్ సోషల్ మీడియా వేదికగా రష్మికకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో ఆమె ‘జయమ్మ’  అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : AA 22 : వార్ ఎఫెక్ట్‌.. అట్లీ కీలక నిర్ణయం

“తమ ఆకర్షణతో, వెలిగిపోయే చిరునవ్వుతో ప్రపంచానికి రంగులు అద్దే మా ‘జయమ్మ’ అలియాస్ రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ చిత్ర బృందం షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రాయలసీమ షెడ్యూల్ పూర్తయింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక పోషించే జయమ్మ పాత్ర కథకు ఎంతో కీలకమని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version