Rashmika : బాలీవుడ్‌లో రష్మిక కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!

Rashmika Shahid Kapoor New Movie

Rashmika Shahid Kapoor New Movie

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి ‘కాక్‌టెయిల్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హోమీ అడజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక, షాహిద్ ప్రేమికులుగా సందడి చేయబోతున్నారు. అయితే, ఈ సినిమా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో కొత్త ప్రాజెక్ట్ ఖరారైందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read : Ragi Topa : రక్తహీనతకు చెక్ పెట్టే ‘రాగి తోప’.. అమ్మమ్మల కాలం నాటి ఈ సూపర్ ఫుడ్‌తో బోలెడన్ని లాభాలు!

ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాలో రష్మిక, షాహిద్ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారట. ఇది ఒక ‘సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ’ డ్రామా అని సమాచారం. వైవాహిక జీవితంలో వచ్చే ఇబ్బందులకు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తోడైతే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కథాంశం అని తెలుస్తోంది. ‘బదాయి హో’, ‘మైదాన్’ వంటి సినిమాలతో తన మార్క్ చూపించిన దర్శకుడు అమిత్ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.