టాలీవుడ్ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉంది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే యానిమల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది.. అయితే తాజాగా ఈ అమ్మడు రెమ్యూనరేషన్ ను పెంచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి..
కిరాక్ పార్టీ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు ఆ తర్వాత ఒక్కో హిట్ సినిమాతో పాన్ ఇండియా బ్యూటీ అయ్యింది.. గత ఏడాది చివర్లో విడుదలైన యానిమల్ సినిమా జనాలను మెప్పించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. ఒకవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో కూడా బిజీగా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసుకుంటుంది..
ఇక ఈ అమ్మడు వరుస సినిమాలు సక్సెస్ అవుతుండటంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు గాను దాదాపు నాలుగు కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. యానిమల్ సక్సెస్ తో తన పారిదోషకాన్ని మరింత పెంచేసిందట.. రానున్న రోజుల్లో మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పుష్ప 2 సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
