Site icon NTV Telugu

Rashmika Mandanna: జపాన్ కు బయల్దేరిన రష్మిక మందన్న.. సినిమా కోసం కాదు..

Rm

Rm

నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా లేదు.. టాలీవుడ్, బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ మధ్య నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అయితే ప్రస్తుతం జపాన్ కు బయల్దేరింది.. టోక్యో కాలింగ్ అంటూ ఫ్లైట్‌లో ఎక్కి ఇలా పోజులు పెట్టేసింది. అయితే రష్మిక మందన ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. రష్మిక ఇంత బిజీలోనూ టోక్యోకి వెళ్తుంది అంటే అది చాలా ముఖ్యమైన పని అని చెప్పాల్సిన పని లేదు.

అయితే షూటింగ్ కోసం మాత్రం అక్కడకు వెళ్లడం లేదు. క్రంచీ రోల్ యానిమీ అవార్డును తీసుకునేందుకు రష్మిక అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.. మన దేశం నుంచి మొదటిసారి వెళ్తున్న నటి ఈమె కావడం విశేషం.. ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉండటంతోనే యానిమల్ తరువాత సక్సెస్ మీట్‌లో ఎక్కడా కనిపించలేదు. ఇలా యానిమల్ సక్సెస్ మీట్‌లో కనిపించకపోవడంతో రష్మిక హర్ట్ అయిందని, అందుకే దూరంగా ఉంటోందనే రూమర్లు కూడా వచ్చాయి.. దీనిపై ఇటీవల స్పందించింది.. వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటం వల్ల రాలేదని క్లారిటి ఇచ్చింది..

ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఫుల్ స్వింగులో ఉంది. ఈ మూవీని ఆపేస్తున్నారంటూ, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందంటూ మధ్యలో రూమర్లు వచ్చాయి.. కానీ ఈ సినిమా సెట్స్ మీద ఉంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. అలాగే గత ఏడాది భారీ సక్సెస్ ను అందుకున్న సినిమాలు యానిమల్ 2, పుష్ప 2 సినిమాల్లో నటిస్తుంది.. లైనప్ లో మరికొన్ని సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది..

Exit mobile version