కన్నడ బ్యూటీ రష్మిక మందన్న, ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు. ‘పుష్ప’, ‘యానిమల్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ తో బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. నటిగానే కాకుండా బాధ్యతగల పౌరురాలిగా రష్మిక అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తన సొంత జిల్లా అయిన కర్ణాటకలోని కొడగులో అత్యధిక ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించిన వ్యక్తిగా రష్మిక రికార్డు సృష్టించారు.
Also Read : Poonam Kaur :హీరోయిన్ కోసం భార్యను కోమాలోకి పంపాడు- డైరెక్టర్‌పై పూనమ్ షాకింగ్ కామెంట్స్
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేవలం మూడు త్రైమాసికాల్లోనే ఆమె సుమారు 4.69 కోట్ల రూపాయల పన్ను చెల్లించి, జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఒకప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు కొనడానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని చెప్పిన రష్మిక, ఈరోజు తన కష్టంతో ఈ స్థాయికి ఎదగడం విశేషం. వరుసగా మూడు 500 కోట్ల సినిమాల్లో నటించిన హీరోయిన్‌గా రికార్డు క్రియేట్ చేసిన ఆమె, ఇప్పుడు పన్ను చెల్లింపులోనూ టాప్‌లో నిలిచి రియల్ హీరో అనిపించుకుంది. పదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న రష్మిక, ఇప్పుడు ఈ అరుదైన ఘనత తో మరోసారి వార్తల్లో నిలిచారు.
