NTV Telugu Site icon

Rashmika mandanna : బేబీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..

Whatsapp Image 2023 07 16 At 6.08.01 Pm

Whatsapp Image 2023 07 16 At 6.08.01 Pm

 

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది ఈ భామ.బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించారు.బేబీ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు.ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకు పలు సినిమాలలో నటించిన సరైన విజయం మాత్రం లభించలేదు. బేబీ సినిమా ఆనంద్ దేవరకొండ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాను చూసి చాలా మంది సెలెబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే నటి రష్మిక మందన్న కూడా ఈ సినిమాపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.. బేబీ సినిమాను చూసాను ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషనల్ పర్ఫామెన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..ప్రతి సీన్ నా హృదయన్ని హత్తుకుంది. బేబీ సినిమా చిత్ర బృందానికి అభినందనలు అంటూ ఈ సందర్భంగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించింది.బేబీ సినిమాపై రష్మిక కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె బేబీ సినిమా చూడటం కోసం  రహస్యంగా థియేటర్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు ఎవరు తనని గుర్తించకుండా క్యాప్ మరియు మాస్క్ ధరించి రహస్యంగా సినిమా చూడటం కోసం థియేటర్ కి వెళ్ళింది ఈ భామ. రష్మిక నటించిన యానిమల్ చసినిమా డిసెంబర్ 1 న విడుదల కాబోతుంది. .యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.

https://twitter.com/iamRashmika/status/1680197496021352448?s=20

Show comments