NTV Telugu Site icon

Rashmika Mandanna: వామ్మో.. రష్మిక ఏంటి ఆ టైంలో అంత బరువులను మోసేస్తుంది.. పోస్ట్ వైరల్..

Rashmika Mandhana

Rashmika Mandhana

రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ లో, జిమ్‌కు వెళ్లే వీడియోను పోస్ట్ చేసింది. వీడియోతో పాటుగా ఒక నోట్‌ లో, ఆమె సుదీర్ఘమైన రాత్రి షిఫ్ట్‌ల కారణంగా దిక్కుతోచని అనుభూతి కలిగిందని పేర్కొంది. ఆమె తన బిజీ షెడ్యూల్‌ ని తెలిపింది. ఉదయం 8 గంటలకు కుబేర షూట్ నుండి తిరిగి వచ్చి, భోజనం తిని, చివరకు మధ్యాహ్నానం తిని పుస్తకం చదివి పడుకుంటే.. ఆమె సాయంత్రం 6 గంటలకు నిద్రలేచి, కార్డియో చేయడం గురించి ఆలోచించానని తెలిపింది. అయినా కానీ మూడ్‌ లేకపోవడంతో చివరికి తెల్లవారుజామున 1 గంటలకు బరువులు ఎత్తాలని నిర్ణయించుకునట్లు తెలిపింది.

Also read: MI vs LSG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లక్నో..

ఇక ఆమె షేర్ చేసిన పోస్ట్ లో ఆమె 100 కిలోల డెడ్‌లిఫ్ట్‌ ని ఎత్తడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ” చాలా రిలాక్స్” అనిపించిందని తెలిపింది. ఇక ఆమె కుబేర సినిమాలో పనిచేసిన తన అనుభవాన్ని ప్రతిబిం, రష్మిక తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ముఖ్యంగా ధనుష్, శేఖర్, మిగిలిన టీమ్‌ తో ఉన్న స్నేహాన్ని హైలైట్ చేసింది. “ధనుష్ సర్, శేఖర్ సర్, నికేత్ అండ్ టీమ్ తో కుబేరా షూటింగ్ చాలా సరదాగా ఉంది” అని ఆమె తన పోస్ట్‌లో రాశారు.

Also read: Happy Birthday Stick: కేక్ మీదకి ‘హ్యాపీ బర్త్ డే స్టిక్’ అడిగిన మహిళ.. చివరకు..

30వ తేదీ తెల్లవారుజామున షూటింగ్ ఉన్నప్పటికీ, సుదీర్ఘమైన రాత్రి షిఫ్ట్‌లు ఆమె నిద్ర గందరగోళానికి గురిచేస్తున్నందున ఆమె మెలకువగా ఉన్నట్లు అర్థమవుతోంది. రష్మిక, ధనుష్, నాగార్జున కుబేరుడులో మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP వారి బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా యొక్క బ్లాక్ బస్టర్ హిట్ ‘యానిమల్‌’ లో ఆమె నటించిన తరువాత రష్మిక రాబోయే ప్రాజెక్ట్‌ లలో పుష్ప 2: ది రూల్, రెయిన్‌ బో, ది గర్ల్‌ఫ్రెండ్, చావా సినిమాలలో నటిస్తున్నారు.

Show comments