రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా అక్టోబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుండగా.. 14న తమిళ, మలయాళ, కన్నడలో భాషల్లో విడుదల అవనుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ విత్ జగపతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు పంచుకున్నారు.
మీ అల్లరి పనులు కొన్ని చెప్పరా, మాకు ఏమీ తెలియట్లే అని జగపతి బాబు అడగ్గా.. ‘వద్దండి. ఇప్పుడు నేను చెప్పేస్తా. తర్వాత వాళ్లు ఏసుకుంటారు’ అని రష్మిక మందన్న సమాధానమిచ్చారు. లాస్ట్ మెసేజ్ ఎవరికి చేశారు అనే ప్రశ్నకు.. తర్వాత మాట్లాడుకుందాం అని జవాబిచ్చారు. ‘నన్ను ఎప్పుడైనా కలవాలనుకుంటే జిమ్‌కు రండి’ అని నేషనల్ క్రష్ తెలిపారు. ఏ జిమ్‌కు రమంటారు అని హోస్ట్ జగపతి అడగ్గా.. రౌడీ జిమ్ అని ఒకటి ప్రారంభిస్తానని, తానే ట్రైనర్‌గా ఉంటానని చెప్పారు. మీ క్రష్ ఎవరు అని అడగ్గా.. ఆడియన్స్ వైపు చూస్తూ సైగలు చేశారు. ‘మీలో ఎవరైనా విజయ్ అనే పేరున్న వాళ్లు ఉన్నారా?’ అని రష్మిక సరదాగా అన్నారు. రష్మిక ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రేపు రాత్రి 8.30 గంటలకు జీ5లో ఈ షో టెలికాస్ట్ కానుంది.
