Site icon NTV Telugu

Rashmika Mandanna : క్రేజీ అప్డేట్‌.. రష్మికకు హ్యాట్రిక్‌ ఛాన్స్‌

Rashmika

Rashmika

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్‌గా పరిచయమై చిత్రసీమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న. అయితే.. ఈమె ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుని వివిధ భాషలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఇండస్ట్రీకి వచ్చిన 6 సంవత్సరాల్లో ఈమె తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా రష్మిక నటించిన వారసుడు సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే.. తాజాగా రష్మిక సంబంధించి క్రేజీ అప్డేట్‌ ఒకటి చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.

Also Read : COVID-19 vaccines: కోవిడ్ వ్యాక్సిన్‌తో గుండె జబ్బులు..! నిజమెంతా..?

వెంకీ కుడుముల తదుపరి చిత్రంలో రష్మిక మందన్న భాగం కాబోతుందనేది తాజా సమాచారం. అయితే.. వెంకీ కుడుముల ఛలోతో రష్మిక టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా.. ఆయన దర్శకత్వంలో భీష్మ కూడా రష్మిక నటించింది. ఇప్పుడు మళ్లీ హ్యాట్రిక్‌ కోసం చూస్తున్నారు. అయితే.. మార్చిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటించనున్నట్టు తెలిసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను చేయనుందని మరో నివేదిక. ప్రస్తుతం.. రష్మిక మిషన్ మజ్ను, యానిమల్‌, పుష్ప: ది రూల్ సినిమాలతో బిజీగా ఉంది.

Also Read : Honey Rose : చీరకట్టులో కేక పుట్టిస్తున్న బాలయ్య భామ హనీ రోజ్..

Exit mobile version