Site icon NTV Telugu

Rashmika: నీయబ్బ, ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఏంటి ఇలా ఓపెన్ అయిపోయింది!

Rashmika Anand

Rashmika Anand

Rashmika Comments on Anand Deverakonda goes Viral: విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా గం గం గణేశా అనే సినిమా తెరకెక్కింది. ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని పెద్ద ఎత్తున చేస్తోంది సినిమా యూనిట్. అందులో భాగంగా సోమవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రష్మిక మందన హాజరైంది. ఈ సందర్భంగా రష్మికని కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆనంద దేవరకొండ. అందులో భాగంగానే నీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విన్న తర్వాత ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా రౌడీ అని చెప్పాలంటూ అరవడం మొదలుపెట్టారు. దీంతో రష్మిక మైక్ పక్కకు పెట్టి నీ అబ్బ అని ఆనందం తిట్టి ఆ తర్వాత ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా ఇలా స్పాట్లో పెట్టొచ్చా అని అడిగింది.

Vijay- Rashmika: ఒకే రిసార్టులో దొరికేసిన విజయ్, రష్మిక.. ఫొటోలు చూపిస్తూ ఆనంద్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!

వెనుక ఫ్యాన్స్ అందరూ రౌడీ రౌడీ అంటూ అరవడం మొదలు పెట్టడంతో ఇక తప్పక రౌడీనే ఫిక్స్ అవ్వు అన్నట్లుగా కామెంట్ చేసింది. దానికి ఆనంద రౌడీ ఫిక్స్ అవ్వాల్సిన పనిలేదు చిన్న రౌడీ అని కూడా చెప్పవచ్చు అని అనడంతో సరే ఆప్షన్ ఇచ్చావు కదా చిన్న రౌడీ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో ఈవెంట్ అంతా రౌడీ నినాదాలతో మారు మోగిపోయింది. ఈ సంభాషణ విన్న తర్వాత దాదాపు అందరూ విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి ఖాయమే అనే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అదేమీ లేకపోతే ఆనంద దేవరకొండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవ్వడం వరకు ఓకే అంతే కానీ నువ్వు నా ఫ్యామిలీ రా అని చెప్పాల్సిన అవసరం లేదు కదా అని అంటున్నారు. అంతేకాక ఎంతో దగ్గర వారైతే తప్ప నీ అబ్బ లాంటి పదాలు వాడారు కాబట్టి రష్మిక చెబుతున్న చుట్టరికం అఫీషియల్ అయ్యే రోజు త్వరలోనే ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Exit mobile version