Site icon NTV Telugu

Rashmika Mandanna : ఆ వార్తల్లో నిజం లేదు.. అది నా బాధ్యత

Rashmika Mandanna

Rashmika Mandanna

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న వివాదంలో చిక్కకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. విద్యార్థిగా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొన్నానని, దీంతో తన ఫోటో పేపర్లో రావడంతో అది చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్‌గా అవకాశం కల్పించిందని ఆమె వెల్లడించారు. అయితే, తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన పరంవా నిర్మాణ సంస్థ పేరు చెప్పడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి చూపించలేదంటూ పలువురు కన్నడిగులు రష్మిక మండిపడుతున్నారు. అయితే.. రష్మిక నటించిన కిర్‌ పార్టీ సినిమాకు ‘కాంతార’ ఫేం రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే.. వీరిద్దరి మధ్య బేధాభిప్రాయలు వచ్చాయని, ఈ కారణంతోనే ఎంతోమంది ప్రముఖులు ‘కాంతార’ను ప్రశంసించినా రష్మిక ఏం మాట్లాడలేదంటూ విమర్శలు చేస్తున్నారు. కృతజ్ఞతాభావంలేని ఆమెను బ్యాన్‌ చేయాలంటూ సోషల్‌ మీడియాలో చర్చకు తెరలేపడంతో మీడియాలో వార్తలు వచ్చాయి.

Also Read : Mandous : మాండుస్‌ ఎఫెక్ట్‌.. విద్యా సంస్థలకు సెలవు..
అయితే.. తాజాగా దీనిపై రష్మిక స్పందిస్తూ.. కన్నడ చలన చిత్ర పరిశ్రమ తనపై నిషేధం విధించిందన్న వార్తల్లో ఎటాంటి నిజం లేదని, ఆ వార్తల్ని ఖండిస్తూ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు రష్మిక. “‘కాంతార’ సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిత్రం చూశాక బృందానికి నేను మెసేజ్‌ పెట్టా. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్‌లు కూడా బయటకు రిలీజ్‌ చేయలేను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా నేను ఏం చేస్తున్నానో అది ప్రేక్షకులకు చెప్పడం నా బాధ్యత” అని రష్మిక స్పష్టం చేశారు.

Exit mobile version