Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల పట్టణంలో ర్యాపిడో డ్రైవర్ మనోజ్ కుమార్ కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. గాంధీ చౌక్‌లోని ఒక మెడికల్ షాప్‌లో పనిచేస్తూ, తన భార్య, తల్లి, కుమారుడితో కూడిన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆయన పార్ట్ టైమ్‌గా ర్యాపిడో డ్రైవర్‌గా సేవలందిస్తున్నారు. నిన్న రాత్రి గాంధీ చౌక్ ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయన బైక్‌పై ఎక్కారు. రాత్రి సుమారు ఆరు గంటల సమయంలో వారిని పట్టణ శివారులోని నంద్యాల పబ్లిక్ స్కూల్ వద్దకు మనోజ్ కుమార్ తీసుకువెళ్లారు.
అక్కడకు చేరుకోగానే ఆ ఆగంతకులు ఒక్కసారిగా మనోజ్ కుమార్‌ను సమీపంలోని పొదల్లోకి లాక్కొని వెళ్లి దారుణంగా చితకబాదారు. అనంతరం ఆయన ఫోన్ నుంచి ఎవరికైనా కాల్ చేసి తక్షణమే రెండు లక్షల రూపాయలు తెప్పించాలని తీవ్రంగా బెదిరించారు. ప్రాణభయంతో మనోజ్ కుమార్ తన ముగ్గురు స్నేహితులకు వరుసగా ఫోన్లు చేసి డబ్బు సహాయం కోరినప్పటికీ, తమ వద్ద అంత సొమ్ము లేదని వారు సమాధానమిచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ కిడ్నాపర్లు మనోజ్ కుమార్‌ను మళ్లీ విచక్షణారహితంగా కొట్టి, ఆయన ఫోన్ నుంచి సిమ్ కార్డ్‌ను లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు.
Also Read
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
- Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
- Snake bite: కానిస్టేబుల్‌ను కాటేసిన పాము.. AI సాయంతో దక్కిన ప్రాణాలు..
తీవ్ర గాయాలపాలైన మనోజ్ కుమార్ ఎలాగోలా సమీపంలోని పబ్లిక్ స్కూల్ వాచ్మెన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వాచ్మెన్ సహాయంతో తన స్నేహితుడికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయాలతో ఉన్న మనోజ్ కుమార్‌ను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు (జి.జి.హెచ్) తరలించారు. కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న డ్రైవర్‌పై ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
-
Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
-
Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
-
Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్‌గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?