NTV Telugu Site icon

Rape And Kidnap: మహిళపై అత్యాచారం.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేసిన తాంత్రికుడు..!

Rape Case

Rape Case

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తాంత్రికుడి ఇంటి బయట ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తాంత్రికుడు మొదట తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. ఆ తర్వాత తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని మహిళ ఆరోపించింది. ఈ విషయమై మహిళ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరగడంతో ఆ మహిళ సోమవారం తాంత్రికుని ఇంటి బయట ధర్నాకు దిగింది. మరోవైపు తాంత్రికుడి బంధువులు ఆ మహిళను పంపించాలని చూడగా.. పురుగుల మందు తాగింది.

Daksha Nagarkar: ట్యాలెంట్ చూపిస్తున్నా.. పిల్లను పట్టించుకోరేంటయ్యా

వివరాల్లోకి వెళ్తే.. ప్రయాగ్‌రాజ్‌లోని పూరముఫ్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ బిహ్రా నివాసి అయిన మహిళ భర్త మదన్‌కు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధిని నయం చేసేందుకు ఆ తాంత్రికుడు దగ్గరికి తీసుకురాగా.. ఆ మహిళపై కన్ను పడింది. దీంతో తాంత్రికుడు మొదట మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని.., ఆ తర్వాత ఆమె కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఆరోపించారు. ఈ విషయమై సదరు మహిళ తాంత్రికుపై పిప్రి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. నిందితుడు తాంత్రిక్ ఇంటి బయట మహిళ ధర్నాకు దిగిందని తెలిపారు. ఆ మహిళా తన కూతురిని వదిలేయాలని ఫోన్ లో కోరగా.. ఈ విషయమై తాంత్రికుడితో గొడవ పడ్డాడు. దీని తర్వాత నిందితుడి బంధువులు ఆమెను అక్కడనుంచి పంపించడానికి ప్రయత్నించారు. మరోవైపు బాధితురాలు తన బిడ్డను తనకు అప్పగించాలని.. లేదంటే విషం తాగుతానంటూ బెదిరించి విషం తాగింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

South Central Railway: వారంలో హైదరాబాద్-ఢిల్లీ రూట్‌లో బాలాసోర్ లాంటి ప్రమాదం.. రైల్వేకి హెచ్చరిక లేఖ?

సమాచారం అందుకున్న పిప్రి పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆ తాంత్రికుడు మహిళ యొక్క 15 ఏళ్ల కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుడి బారి నుంచి కూతురిని విడిపించేందుకు ఆ మహిళ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో జూన్ 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితులు తాంత్రిక్ రాజు, అతని ముగ్గురు సోదరులు విజయ్, అమర్, సురేంద్రలపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.