NTV Telugu Site icon

Kakinada Crime: కాకినాడలో మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్‌

Kakinada Crime

Kakinada Crime

Kakinada Crime: ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కాకినాడలోని కోటనందూరులో గుర్తు తెలియని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.. గత శుక్రవారం ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుండగా.. ఆ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో అందరూ చేస్తుండగానే మెయిన్ రోడ్డు పై ఉన్న మార్కెట్ షెడ్‌లో దారుణానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.. బాధితురాలు గిరిజన మహిళగా.. మతిస్థిమితం లేని మహిళగా అనుమానిస్తున్నారు.. మతిస్థిమితం లేని మహిళను తీసుకొచ్చి.. మార్కెట్‌ షెడ్‌లో అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది.. మద్యం, గంజాయి మత్తులో యువకులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు..

Read Also: Same Gender Marriage: గే కమ్యూనిటీ సమస్యలపై కమిటీ ఏర్పాటు.. సుప్రీంకు తెలియజేసిన కేంద్రం

అయితే, ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోవడంతో.. కోటనందురులో విచారణ చేపట్టారు పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.. ఆ ఘటన తర్వాత భాదితురాలు ఏమైంది..? ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారు..? అసలు ఆ యువకుడు ఎవరు..? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. వైరల్‌గా మారిన వీడియో ప్రకారం.. రోడ్డు పక్కనే ఉన్న షెడ్‌లో కొన్ని బైక్‌లు పార్క్‌ చేసి ఉన్నాయి.. ఆ బైక్‌ల వెనుకాల మహిళపై దారుణానికి పాల్పడ్డాడు ఆ యువకుడు.. ఓ వ్యక్తి వీడియో తీయాలని చెబుతుందా.. తీస్తున్నాను.. నిన్న ఒకటి.. ఈ రోజు మరొకటి అంటూ మరో వ్యక్తి మాటలు వినిపిస్తున్నాయి.. అయితే, వీడియో చివర్లో ఓ వ్యక్తి.. ఘటనా స్థలానికి దగ్గర వెళ్లినట్టుగా కనిపిస్తోంది.. ఆ తర్వాత ఏమైంది.. వాళ్లు ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.