NTV Telugu Site icon

Sexual Harassment: రూ.50 ఎర చూపి మైనర్ బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష

Uttarakhand

Uttarakhand

ఉత్తరాఖండ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం ఘటనపై కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా.. జరిమానా కూడా విధించింది. ఈ కేసులో ప్రత్యేక, జిల్లా సెషన్స్ జడ్జి ధరమ్ సింగ్ తీర్పు చెప్పారు. రూ. 5000 జరిమానా, జరిమానా చెల్లించని పక్షంలో 30 రోజుల అదనపు సాధారణ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ POCSO మోహన్ పంత్ మాట్లాడుతూ.. ఈ ఘటన 2020 మే 13న సాయంత్రం 4 గంటలకు జరిగింది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మైనర్ బాలికకు ఫోన్ చేసి.. ఆమెకు రూ. 50 ఇచ్చి సమీపంలోని దుకాణంలో కొన్ని వస్తువులను తీసుకురమ్మని చెప్పాడు.

Read Also: AP Assembly Session: అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైన ప్రభుత్వం.. పూర్తిస్థాయి బడ్జెట్‌ లేనట్టే..!?

అయితే.. ఆ వస్తువులు తీసుకుని నిందితుడి ఇంటికి వెళ్లగా.. నిందితుడు ఆమెను తన గదిలోకి ఈడ్చుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. అంతేకాకుండా.. బాలికను దారుణంగా కొట్టాడు. దీంతో బాలిక శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. అనంతరం.. బాధితురాలి తల్లి, కుటుంబ సభ్యులు నిందితుడి గదికి చేరుకున్నారు. దీంతో.. వెంటనే నిందితుడు బాలికను వదిలిపెట్టాడు. ఈ ఘటనపై గ్రామపెద్దలు రెవెన్యూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌచర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రెవెన్యూ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌచర్‌ నిందితుడిని అరెస్టు చేశారు. కాగా.. ఇన్ని రోజుల పాటు జైల్లో ఉన్న నిందితుడికి కోర్టు కీలక తీర్పునిచ్చింది.

Read Also: Kamal Haasan: ఇంకా దొరకని అవార్డ్స్ చాలా ఉన్నాయి..కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు