Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్‌కు కర్ణాటక హైకోర్టు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ ఎదుర్కొంటున్న ‘కాంతార’ మిమిక్రీ వివాదంలో కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతేడాది గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేదికపై రిషబ్ శెట్టి నటనను అనుకరించే క్రమంలో, దైవానికి సంబంధించిన సంప్రదాయాన్ని రణవీర్ కించపరిచారనే ఆరోపణలతో బెంగళూరులో ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రణవీర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు..
ఆయనకు ఒక షరతు విధించింది. తన వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు ప్రాయశ్చిత్తంగా మైసూరులోని చాముండి కొండపై ఉన్న చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలని ఆదేశించింది. అది కూడా రణవీర్ నాలుగు వారాల లోపు ఆలయాన్ని సందర్శించి తన పశ్చాత్తాపాన్ని చాటుకోవాలని కోర్టు పేర్కొంది. కానీ ఇప్పటికే రణవీర్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెబుతూ.. తన ఉద్దేశ్యం ఎవరినీ బాధించడం కాదని, కేవలం రిషబ్ శెట్టి నటనను అభినందించడమేనని ఆయన స్పష్టం చేశారు. రణవీర్ ఆలయ సందర్శన పూర్తి చేసి, తన భక్తిని చాటుకున్న తర్వాత ఈ ఎఫ్.ఐ.ఆర్.ను కొట్టివేస్తూ తుది తీర్పు ఇస్తామని జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం వెల్లడించింది. అలాగే సెలబ్రిటీలు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు మతపరమైన, సంస్కృతి పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా కోర్టు హితవు పలికింది. కాగా ఈ వివాదం సద్దుమణిగితే ఆయనకు పెద్ద ఊరట లభించినట్లే.
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు