Site icon NTV Telugu

Ranveer Singh: ఆ వీడియోపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయించిన ర‌ణ్‌వీర్ సింగ్..

Ranveer Singh

Ranveer Singh

బాలీవుడ్ సూపర్ స్టార్ నటుడు ర‌ణ్‌వీర్ సింగ్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కాకపోతే అది ఫేక్ వీడియో అని తేలింది. ఇకపోతే వైరల్ గా మారిన వీడియోలో దేశ రాజకీయాలపై హీరో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు కనబడుతుంది. ముఖ్యంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ర‌ణ్‌వీర్ సింగ్ కామెంట్ చేసినట్లు అందులో కనబడుతుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని ఆ వీడియోలో రణవీర్ కోరుతున్నట్లుగా ఫేక్ వీడియోని క్రియేట్ చేశారు కొందరు.

Also read: Pemmasani Chandrasekhar: నా విజయం ఖరారు.. భారీ మెజార్టీ సాధిస్తా

తాజాగా ర‌ణ్‌వీర్ సింగ్ వారణాసి నగరానికి వెళ్ళాడు. అక్కడ హీరో తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లుగా ఆ వీడియోలో అర్థం అవుతోంది. కాకపోతే., ఆ వీడియో మాత్రం నిజమైనది కాదంటూ తెలిసింది. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత డీప్ ఫేక్ వీడియో అని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీ ద్వారా వీడియోలోని ఆడియోను మార్చేసినట్లు అధికారులు గుర్తించారు.

Also read: Pemmasani Chandrasekhar: నా విజయం ఖరారు.. భారీ మెజార్టీ సాధిస్తా

ఇక ఆన్లైన్లో వైరల్ గా మారిన ఈ వీడియో పై తాజాగా హీరో కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించి అభిమానులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. డీప్ ఫేక్ వీడియోలను ‘సో బచ్ దోస్తో..’ అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి తాజాగా ఎఫ్ఐఆర్ ను నమోదు చేశాడు హీరో ర‌ణ్‌వీర్. దాంతో సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ సెలబ్రెటీలకు కాస్త ఇబ్బందికరంగా మారింది.

Exit mobile version