స్టార్ హీరో ప్రభాస్ గురించి ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మారిన యూట్యూబర్ రణవీర్ అల్లా బాడియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణవీర్, “కొంతమందిని చూస్తే వీరు దేవుడి బిడ్డలు అనిపిస్తుంది. అలా నాకు ప్రభాస్‌ను చూస్తే అనిపిస్తుంది,” అని చెప్పుకొచ్చారు. నిజానికి, ప్రభాస్ చాలా తక్కువ మందితో మాత్రమే సంభాషిస్తూ ఉంటాడు. స్వభావరీత్యా చాలా సిగ్గరి అయిన ప్రభాస్ గురించి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి మాత్రమే కొన్ని విషయాలు తెలుసు.
అయితే, ప్రభాస్‌ను బయటి నుంచి చూసే వారు సైతం ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిపోతుంటారు. ముఖ్యంగా, ప్రభాస్ ఆతిథ్యానికి ఆయనతో కలిసి పనిచేసే స్టార్స్ అందరూ ఫిదా అవుతుంటారు. అయితే, ఇప్పుడు ఒక యూట్యూబర్ ప్రభాస్‌ను చూసి “దేవుడి బిడ్డ అనిపిస్తున్నాడు” అంటూ కామెంట్ చేయడం హృదయాన్ని తాకుతోంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఒకవైపు ఆయన కాలు బాగోకపోయినా, ఆయన తనదైన శైలిలో ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరూ ఆయన చేయబోతున్న సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
