NTV Telugu Site icon

Rohit Sharma: అయ్యో రాములా.. మళ్లీ నిరాశపర్చిన రోహిత్!

Rohit Sharma

Rohit Sharma

భారత దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఆటగాళ్లు రంజీ బరిలోకి దిగారు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు రంజీ మ్యాచ్‌లలో బరిలోకి దిగారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగ్గా ఆడలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెడ నొప్పి కారణంగానే బెంచ్‌కే పరిమితం అయ్యాడు.

గత కొన్ని నెలలుగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశపరిచాడు. జమ్ముకశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడుతున్న హిట్‌మ్యాన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. 19 బంతులు ఎదుర్కొని మూడు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. పేసర్ ఉమర్ నాజిర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. హిట్‌మ్యాన్ 3 పరుగులకే అవుట్ అవ్వడంతో లోకల్ ఫాన్స్ నిరాశపడ్డారు. రోహిత్ అవుట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజెన్స్ ‘అయ్యో రాములా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: IND vs ENG: ఇది నేను అస్సలు ఊహించలేదు: జోస్ బట్లర్

ముంబై తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పంజాబ్ తరపున ఆడనున్న శుభ్‌మాన్ గిల్ 4 పరుగులే చేయగా.. ముంబై కెప్టెన్ అజింక్య రహానే 12 పరుగులు చేశాడు. ముంబై తరఫున శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, శార్దూల్ ఠాకూర్, తనుష్ కొటియన్ లాంటి స్టార్స్ కూడా ఆడుతున్నారు. రోహిత్ శర్మ 2015 తర్వాత తొలిసారిగా రంజీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.