Site icon NTV Telugu

Range Rover Sport Launched: భారత్‌లో తొలి మెడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV లాంచ్

Range Rover Sport

Range Rover Sport

Range Rover Sport Launched: రేంజ్ రోవర్ తన తొలి మెడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రెండు పవర్‌ట్రైన్ ఆప్షన్‌లతో 2025 అప్‌డేట్‌లో విడుదలైన ఈ లగ్జరీ SUVకు కొత్త ఫీచర్లు, ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌ అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.45 కోట్లుగా నిర్ణయించారు. గత మోడల్‌తో పోలిస్తే దీని ధర రూ. 5 లక్షల మేర పెరిగింది. 2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ 3.0 లీటర్ పెట్రోల్, 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లతో టాప్-స్పెక్ డైనమిక్ HSE వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ SUV కోసం ఫూజీ వైట్, సెంతోరిణి బ్లాక్, జియోలా గ్రీన్, వెరసిన్ బ్లూ, చారెంట్ గ్రే వంటి ఐదు కస్టమైజ్ చేయదగిన ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లను అందిస్తున్నారు.

Also Read: BCCI: కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు సిద్ధమైన బీసీసీఐ..

ఈ లగ్జరీ SUVలో అధునాతన ఫీచర్లను అందించారు. ఇందులో 13.1-అంగుళాల పివి ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 13.7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, హెడ్ అప్ డిస్ ప్లే, ఎయిర్ ప్యూరిఫయర్, డైనమిక్ ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్-రోడ్ క్రూజ్ కంట్రోల్, డిజిటల్ LED హెడ్లాంప్‌లు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ SUVలో సెమీ అనిలిన్ లెదర్ సీట్లు, మసాజ్ ఫ్రంట్ సీట్లు వంటి కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతాయి.

Also Read: Effect On Male Fertility: మగాళ్లు జాగ్రత్త.. ఇలా చేస్తే మీ సంతానోత్పత్తిపై తీవ్ర సమస్యలు తలెత్తుతాయి

ఈ కారు లాంచ్ ఈవెంట్‌లో JLR ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా మాట్లాడుతూ.. తాజా రేంజ్ రోవర్ స్పోర్ట్ సెక్టార్‌లో కొత్త ప్రమాణాలను స్థాపిస్తుంది. ఇది మా అత్యంత అధునాతన, డైనమిక్ కేపబుల్ వాహనాల్లో ఒకటిగా నిలుస్తుంది. సెమీ-అనిలిన్ లెదర్ సీట్లు, మసాజ్ ఫ్రంట్ సీట్లు ఇంకా హెడ్ అప్ డిస్ ప్లే వంటి ఫీచర్లతో, మా కస్టమర్లకు ఈ SUV లో మంచి సౌకర్యం, టెక్నాలజీ అనుభూతిని అందించేలా ప్లాన్ చేసామని ఆయన తెలిపారు. మెడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ లగ్జరీ, సాంకేతికత, పనితీరును సమిష్టిగా అందిస్తూ రేంజ్ రోవర్ బ్రాండ్ ప్రతిష్టను మరింత ఉజ్జ్వలంగా నిలబెట్టేలా కనపడుతోంది.

Exit mobile version