Site icon NTV Telugu

Ramayana Update: రెండు పార్టులుగా ‘రామాయణ’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Ramayana

Ramayana

రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్‌ డైరెక్టర్ నితేశ్‌ తివారీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రంను రూపొందిస్తున్నారు. సుదీర్ఘ సన్నాహాల అనంతరం గత ఏప్రిల్ మాసంలో రామాయణ చిత్రీకరణ మొదలైంది. భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన రామాయణ గురించి తాజాగా ఓ అప్‌డేట్‌ వచ్చింది.

రామాయణ చిత్రం రెండు పార్టులుగా రానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీలను కూడా తెలుపుతూ ఓ పోస్టర్‌ రిలీజ్ చేసింది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇటీవలి రోజుల్లో ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కుతోందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పడింది.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు!

రామాయణలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. ఇక హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కనిపించనున్నట్లు సమాచారం. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌తో పాటు హాలీవుడ్‌ టాప్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ హన్స్‌ జిమ్మెర్‌ ఈ సినిమా సంగీతం అందించనున్నారట. తెలుగు వెర్షన్‌ సంభాషణల బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. 800 కోట్లతో రామాయణ తెరకెక్కుతోంది.

 

Exit mobile version